రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
SRPT: సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై చివేముల మండలం బండమీది చందుపట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాచారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.