'దళారులకు కాకుండా ప్రభుత్వ కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలి'
VZM: మెరకముడిదాం MPDO సులోచనారాణి ఇవాళ స్దానిక సోమలింగాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులకు కాకుండా ప్రభుత్వ కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలన్నారు. గతంలో డబ్బుల కోసం ఇబ్బంది పడ్డప్పటికీ ఇప్పుడు ధాన్యం మిల్లులకు వెళ్లేలోపీ రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతోందన్నారు.