కుష్టు వ్యాధిపై అపోహలు తొలగించాలి: జేసీ
సత్యసాయి: కుష్టు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ) మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాలని సూచించారు. వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే ఆరు నెలల్లో పూర్తిగా నయం అవుతుందని తెలిపారు.