దేవాలయంలోకి మొబైల్.. వైసీపీ వీడియో రిలీజ్
NDL: శ్రీశైలంలో దేవాలయంలోకి మొబైల్ తీసుకువెళ్లడం పూర్తిగా నిషేదం. అయితే, ఓ భక్తుడు దేవాలయంలోకి ఫోన్‌ను తీసుకెళ్లి గర్భగుడిలోని స్వామివారిని వీడియో తీసినట్లు వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. మొబైల్‌ను గుడి లోపలికి ఎలా అనుమతించారు? భక్తుడు వీడియో తీస్తుంటే భద్రతా సిబ్బంది నిద్రపోతున్నారా? అంటూ తన X ఖాతాలో ప్రశ్నించింది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.