VIDEO: పుంగనూరులో హమాలీలకు ఉచిత వైద్య పరీక్షలు
CTR: పుంగనూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం హమాలీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. ECG, కిడ్నీ, కొలెస్ట్రాలు, TB, BP, HIV, షుగర్ పరీక్షలు చేశామన్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో, గోదాం DT రమేష్, DEO నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.