VIDEO: గోకవరంలో ప్రతి ఆదివారం ట్రాఫిక్ జామ్
E.G: గోకవరంలో ఆదివారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇరుకు వంతెన నుంచి దేవిచౌక్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రతి ఆదివారం చేపల మార్కెట్ వద్ద వాహనదారులు, పాదచారులు నరకం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు దుకాణాలను తొలగించి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పోలీస్, పంచాయితీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.