హైదరాబాద్‌లో జాతీయ నాణేల సదస్సు
TG: హైదరాబాద్ తొలిసారిగా జాతీయ నాణేల సదస్సు నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సదస్సు తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటి చెప్పడానికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు.