పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో రేపు సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.