అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 8వ వక్ఫ్ బోర్డ్ సమావేశం
NLR: విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన గురువారం 8వ బోర్డ్ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల సౌదీ అరేబియాలో మృతి చెందిన 42 మందికి సంతాపంగా ప్రత్యేక దువా ప్రార్థన కార్యక్రమం జరిగిన అనంతరం బోర్డ్ సమావేశాన్ని ప్రారంభించారు.