పోలీస్ నిఘాలో RTC డిపోలు
ASF: జిల్లా కేంద్రంలోని RTC డిపోలు పోలీస్ నిఘాలో ఉన్నాయి. డిపో మేనేజర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బస్సులు పంపిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. సమ్మె రెండో రోజు మొత్తం 33 బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. దీనిలో 27 బస్సులు అద్దె బస్సులు కాగా, 6 ఆర్టీసీ బస్సులు ఉన్నాయన్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.