దివ్యాంగులకు ట్రై సైకిల్, ల్యాప్ టాప్లను పంపిణీ చేసిన కలెక్టర్

మన్యం: జిల్లాకు చెందిన దివ్యాంగులకు ట్రై సైకిల్, ల్యాప్ టాప్లను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పంపిణీ చేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నిర్మల కాలనీకి చెందిన చింతాడ గుంపయ్య తాను దివ్యాంగుడునని, నడవలేనందున తనకు ట్రై సైకిల్‌ను మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.