పిడుగుపాటుకు పాడి ఆవు మృతి

పిడుగుపాటుకు పాడి ఆవు మృతి

NGKL: వెల్దండ మండలం అజిలాపూర్లో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి రైతు కేశమోని శ్రీశైలంకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. సుమారు రూ.50 వేల విలువైన ఆవు చనిపోవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. జీవనోపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం నష్టపరిహారంతో ఆదుకోవాలని బాధిత రైతు అధికారులను వేడుకున్నాడు.