జల హారతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం 'జల హారతి' మహోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువు వద్ద గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో జల హారతి ఇచ్చారు.