VIDEO: కొడకండ్ల ఎస్టీ హాస్టల్‌లో విద్యార్థి పై దాడి
JN: కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర వసతి గృహంలో గురువారం అర్ధరాత్రి వేళ పదో తరగతి విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. క్రమశిక్షణ పాటించమని చెప్పినందుకు మద్యం మత్తులో హాస్టల్ గోడ దూకి లోపలికి వచ్చి చితకబాదినట్లు బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.