ప్రకాష్ రాజ్ తల్లి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం

ప్రకాష్ రాజ్ తల్లి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం

నటుడు ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణలత మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ప్రకాష్ రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను.  భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలి' అని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నివాళులర్పించారు.