రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ప్రకాశం: మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి వ్యక్తికి గాయాలయ్యాయి. ఒంగోలు నగరం సుజా తనగర్‌కు చెందిన పి. శ్రీనివాసరావు మేదరమెట్ల వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. స్థానిక పోలీసులు ఈ ప్రమాదంపై విచారిస్తున్నారు.