యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
GDWL: రాజోలిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తూ తుంగభద్ర తీరం, కోటవీధి బావి దగ్గర మాఫియా నిల్వ చేస్తున్నారు. ఈ మాఫియాకు కొంతమంది రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు అండగా ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల ఆదాయం నష్టం జరుగుతోందని ప్రజలు అంటున్నారు.