వినాయక అలంకారంలో మారెమ్మ
CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని విరూపాక్షి మారెమ్మ ఆలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, గణనాథుని రూపంలో అలంకరించారు. ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.