VIDEO: బిలాల్ ఈద్గా మైదానంలో ఘనంగా ఈద్ నమాజ్
HYD: రంజాన్ సందర్భంగా HYD మసాబ్ ట్యాంక్‌లోని బిలాల్ ఈద్గా మైదానంలో ఈద్ నమాజ్ ఘనంగా నిర్వహించారు. మౌలానా షా జమెల్ ఉర్ రెహ్మాన్ ఆధ్యాత్మిక ప్రసంగం చేయగా, ముఫ్తీ తాజమ్ముల్ హాఫిజ్ నేతృత్వంలో నమాజ్ జరిగింది. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.