IND vs AUS: 129 మీటర్ల భారీ సిక్సర్
టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్(74) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు ఏకంగా 129 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కొట్టిన ఈ స్ట్రెయిట్ సిక్సర్ ఏకంగా స్టేడియం రూఫ్‌ను తాకింది. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.