స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నూకరాజు సేవలు అభినందనీయం

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నూకరాజు సేవలు అభినందనీయం

VZM: ప్రత్యేక ఉప కలెక్టర్ నూకరాజు సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కొనియాడారు. మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన నూకరాజును, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నూకరాజు సేవలను ప్రశంసించారు.