ఫుడ్ పాయిజనింగ్‌తో 52 మంది విద్యార్థులు అస్వస్థత
TG: జోగులాంబ గద్వాల జిల్లా బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్‌తో 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం వికటించడంతో వారికి వాంతులు, కడుపునొప్పి వచ్చాయి. వెంటనే వారిని 108 అంబులెన్స్‌లో గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహారం నాణ్యతపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.