ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి నగదు అందజేత

PLD: మాచవరం మండలం పిన్నెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇక నుంచి ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామని టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ శేఖర్ బాబు అన్నారు. ఈ ఏడాది పరీక్షల్లో 600 మార్కులకు గాను 568 మార్కులు సాధించిన చిట్యాల ఝాన్సీకి ఆయన రూ. 10 వేల నగదును అందజేశారు.