డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
VZM: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ప్రసాదరావు తెలిపారు. ఆరికతోటకు చెందిన పి. అచ్యుతరావు, జీలికవలసకి చెందిన కె. పాపారావు మద్యం తాగి వస్తూ వాహన తనిఖీల్లో పట్టుబడటంతో సాలూరు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించామన్నారు. న్యాయమూర్తి హర్షవర్ధన్ కేసు విచారణ చేపట్టి నిందితులకు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.