అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు

అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు

NZB: వేల్పూర్ మండలం అమీనాపూర్ వద్ద శుక్రవారం కారు బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుంచి అమీనాపూర్ వెళ్తున్న కారు నారద ఆశ్రమం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అమీనాపూర్ గ్రామానికి చెందిన లోలం శ్రీనివాస్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.