ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో వాహన తనిఖీలు
కృష్ణా: జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ముమ్మర వాహన తనిఖీలు చేశారు. ఈసందర్భంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.