VIDEO: ఏడేళ్లుగా అసంపూర్తిగా అయిజ-పులికల్ రోడ్డు

GDWL: అయిజ-పులికల్ రోడ్డు నిర్మాణం ప్రారంభించి ఏడేళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. 2018లో అప్పటి ఎమ్మెల్యే అబ్రహం 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేయించారు. అయితే, కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలివేయడంతో ప్రస్తుతం మూడు కిలోమీటర్ల రోడ్డు మాత్రమే పూర్తయింది. మరో మూడు కిలోమీటర్ల రోడ్డు ప్రమాదకరంగా ఉందని, దానిని తక్షణమే పూర్తి చేయాలన్నారు.