నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
ప్రకాశం: ఇవాళ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పీసీ పల్లిలోని పెదఇర్లపాడులో 20 ఎకరాల్లో రూ. 7 కోట్ల వ్యయంతో MSME పార్కులను ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదఇర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళ్లనున్నారు.