VIDEO: నగర శివారులో కుండపోత వర్షం

VIDEO: నగర శివారులో కుండపోత వర్షం

HYD: నగర శివారులో కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపుర్‌ మెట్‌ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.