నేరాలపై విద్యార్థులకు అవగాహన
KDP: మహాత్మా జ్యోతి బాపూలే గర్ల్స్ స్కూల్లో సీఐ సీతారామిరెడ్డి బుధవారం ర్యాగింగ్ నివారణ, సైబర్ క్రైమ్స్‌పై విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్ ఒక నేరమని, దానిపై కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపారు. అలాగే సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాలను వివరించారు.