జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

MBNR: జిల్లాలో గడచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలోని జానంపేటలో 42.3 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. అడ్డాకుల 33.5, దేవరకద్ర 31.5, చిన్న చింతకుంట 22.0, మహమ్మదాబాద్ 11.0, కోయిలకొండ 4.5, మహబూబ్‌నగర్ అర్బన్ 3.5, కౌకుంట్ల 1.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతవరణ శాఖ తెలిపింది.