మిషన్ భగీరథ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా

మిషన్ భగీరథ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా

ASF: ఆసిఫాబాద్ మిషన్ భగీరథ కార్యాలయంలో AITUC నాయకులు, L&T యాజమాన్యం అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఒక నెల 20 లోపు ఒక నెల జీతం, మార్చి 30లోపు మిగిలిన పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు ఎల్&టీ యాజమాన్యం అంగీకరించింది. దీంతో మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు.