లారీ ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

లారీ ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

TG: కరీంనగర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను రుక్మాపూర్‌కు చెందిన తాటికొండ సాయికిరణ్, చిలుక ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.