ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు
ASR: జీకేవీధి మండలం సీలేరులో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టుపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ.. వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు ద్వారా సీలేరు ప్రాంతం పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందుతుందన్నారు. దీనివల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని వివరించారు.