ధర్మవరం రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరు
సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రూ.20.66 కోట్లు మంజూరయ్యాయి. అత్యంత దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను మొదటగా చేపట్టనున్నారు. అలాగే తాడిపత్రి, కల్యాణదుర్గం, పర్ణపల్లి ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి.