'ఐకమత్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు'
NGKL: రంజాన్ ఇఫ్తార్ విందులు కులమతాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని మార్చాల సర్పంచ్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తినిపించి ఆయన ఉపవాస దీక్ష విరమింపజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొంటూ స్థానిక మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.