తవణంపల్లిలో సామాజిక తనిఖీ బహిరంగ సభ

తవణంపల్లిలో సామాజిక తనిఖీ బహిరంగ సభ

CTR: తవణంపల్లి మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పథక సంచాలకులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారి ఏ.రవికుమార్, జిల్లా అంబుడ్స్ పర్సన్ శ్రీ వరదరాజులు, ఎంపీడీవో హరి ప్రసాద్ రెడ్డి, ఎస్ఆర్పీలు కన్నా రెడ్డి, మురార్, ఏపీవో లలిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల అమలు, పారదర్శకతపై చర్చించారు.