ఆరోగ్యకరమైన గ్రామాలను నిర్మిద్దాం: ఎమ్మెల్యే
SKLM: స్వచ్ఛమైన గ్రామమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. రెంటికోట గ్రామంలో గురువారం స్వచ్ఛతకు కొత్త శకం స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల భాగస్వామ్యమే కీలకమని, ప్రతి ఒక్కరూ తమ గ్రామాలను ఆరోగ్యకరంగా నిర్మించాలని పిలుపునిచ్చారు.