'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MHBD: గంగారం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో తహసీల్దార్ బాలకిషన్ ఆదివారం ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అత్యవసరం కాకపోతే ఇంటి నుంచి బయటకు రావొద్దని, వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.