నిరుపేద కుటుంబానికి అండగా గ్రామస్తులు
SRCL: చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కమ్మరి మురళి అనారోగ్యంతో మృతి చెందాడు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు డబ్బులు లేక వారి కుటుంబం కోసం కిష్టంపేట సర్పంచ్‌ను సంప్రదించారు. ఆయన గ్రామస్తులు, ఓ ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందించి రూ. 30,000 ఆర్థిక సాయాన్నిసేకరించారు. వారి సహాయాన్ని పలువురు అభినందించారు.