జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
WGL: ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, సేవించినా 8712584473కు సమాచారం ఇవ్వాలని ఇంతే జార్ గంజ్ ఎస్సై సందీప్ సూచించారు. సోమవారం జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో వరంగల్ కాశిబుగ్గలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిసలవకుండా జాగ్రత్తపడాలన్నారు. గంజాయి–డ్రగ్స్‌కు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు.