విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్‌పార్మర్‌లో మంటలు

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్‌పార్మర్‌లో మంటలు

WGL: వర్ధన్నపేట పట్టణ శివారు కోనారెడ్డి చెరువు సమీపంలోని రైస్ మిల్లు వద్ద ఆదివారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మిల్లు వద్ద మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రధాన విద్యుత్ కేబుల్ మంటలతో దగ్ధమయ్యింది. మిల్లు ఉన్న వరి పొట్టుకు మంటలు వ్యాపించాయి. ఘటన స్థలానికి అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని మంటలను అదుపు చేశారు.