అక్రమ కట్టడాల కూల్చివేతలు

అక్రమ కట్టడాల కూల్చివేతలు

NLR: నగర కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. కొత్తూరు హెచ్.ఆర్ కళ్యాణమండపం నుంచి తెలుగు గంగ కాలువ కార్యాలయం వరకు ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని శనివారం సిబ్బంది చేపట్టారు. కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో గతంలో నిర్దేశించిన మార్కింగ్ వరకు జేసీబీతో రోడ్డు ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించారు.