ఈ నెల 15 VHP ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై సమావేశం
W.G: హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు VHP ప్రాంత అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. భీమవరంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక త్యాగరాజు భవనంలో ఈ సదస్సు ప్రారంభమవుతుందని, హిందూ బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.