అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
JN: పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇవాళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.