ఒకే పోలిక… ఒకే మనసు – కవలల విశేషం..
WGL: ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మండలం కట్ర్యాలకు చెందిన తాటికాయల రాజు–రమేష్ అన్నదమ్ములు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకే పోలికతో జన్మించిన వీరిద్దరి రుచులు, అభిరుచులు కూడా సమానంగా ఉండటం విశేషం. కవలల మధ్య ఉన్న ప్రత్యేక బంధం, అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా ఈ దినోత్సవం నిలుస్తోంది.