'సీఆర్టీలకు జీతాలు చెల్లించండి'

'సీఆర్టీలకు జీతాలు చెల్లించండి'

పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీలకు జీతాలు చెల్లించాలని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు పల్ల సురేష్ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీలకు రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు వచ్చి రెండు నెలలైనా నేటికీ జీతాలు చెల్లించకపోవటం దారుణం అన్నారు.