ఈనెల 28న HYDలోని విద్యుత్ సౌధ వద్ద ధర్నా: సీఐటీయూ
PDPL: సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన రూ.46 వేల కోట్ల బకాయిల కోసం ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేపడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి తెలిపారు. మంగళవారం జీడీకే 2ఏ గని వద్ద గోడ పత్రికను విడుదల చేసిన ఆయన, బకాయిలు రాకపోతే బొగ్గు సరఫరా నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.