VIDEO: విద్యార్థిపై కర్కశత్వం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఖమ్మంలోని ఓ స్కూల్ హాస్టల్లో వార్డెన్ చేతిలో 7వ తరగతి విద్యార్థి భార్గవ్ తీవ్రంగా దెబ్బలు తిన్న ఘటన కలకలం రేపింది. తాను హాస్టల్లో ఉండలేనని చెప్పినందుకు వార్డెన్ అమానుషంగా దాడి చేశాడని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని బాధిత విద్యార్థి వాపోయాడు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.