VIDEO: స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం

VIDEO: స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం

AKP: నక్కపల్లి మండలం చందనాడ వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, ప్లాంట్ ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. మూడేళ్లలో ఉత్పత్తిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. మొత్తం రూ.2.37 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్‌ను స్థాపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.